హైదరాబాదులో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

  • నగరంలో రోడ్లు జలమయం
  • ఇబ్బందిపడిన వాహనదారులు
  • మరో గంట పాటు భారీ వర్ష సూచన ఉందన్న అధికారులు 
హైదరాబాదు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, మాదాపూర్, గోల్కొండ, పటాన్ చెరు, హైటెక్ సిటీ, పంజాగుట్ట, చేవెళ్ల, లక్డీకాపూల్, టోలీచౌకి, బంజారాహిల్స్, మియాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, షేక్ పేట, శేరిలింగంపల్లి, ఎర్రగడ్డ, ఫిలింనగర్, మాసాబ్ ట్యాంక్, మొయినాబాద్, ఎస్సార్ నగర్, గోల్కొండ, చందానగర్, నాంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, శంకర్ పల్లి, ఖైరతాబాద్ ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది. 

దాంతో ఆయా ప్రాంతాల్లో రోడ్లు జలమయం కాగా, వాహనదారులు ఇబ్బంది పడ్డారు.  మరో గంట పాటు నగరానికి భారీ వర్ష సూచన ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 


Heavy Rain
Hyderabad
Weather

More Telugu News